Monday, 30 June 2025

సుజాత మేడం పై కవిత..... నవ్వే ఒక సమాధానం

. నవ్వే ఒక సమాధానం.............. పొలంతల్లి ఒడిలో వరికుప్ప పాన్పుల అనంత సౌభాగ్యం తన ఒడిలో తులతూగుతున్న వేళ పూల వర్షం కురువాల్సిన చోట రాళ్ల వాన పడి తన హృదయ సంద్రం కన్నీటి అలలతో ధ్వనించింది నిశ్శబ్దం ఆవరించిన శూన్యంలో చీకటిని చీల్చడానికై అజ్ఞానాన్ని పారద్రోలే జ్ఞాన జ్యోతియై వెలిగింది చెదరని బెదరని కొండంత గుండె చేసుకుని గుండె నిండా బాధ తల పైన భారంతో నవ్వే ఒక సమాధానంగా అడుగు శబ్దం కదిలి తన నడకను కొనసాగించింది కష్టాలు సుడిగుండాలని కూర్చున్న లేక బ్రహ్మ రాసిన విధి పై పయనిస్తూనే కాలమును ఆయుధంగా మలచి చీకటిని ఛేదించే మెరుపైంది జడివాన గాలికి వీచే పవన తరంగాలను చిరుగాలిగా మలచుకొని తన పిల్లల భవితవ్యాలకై అనునిత్యం తపించి ఉన్నత శిఖరాలకు చేర్చింది సాధించిన ఇతర ప్రభుత్వ ఉద్యోగాలను సైతం వదిలి తన మనసుకు నచ్చిన ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకుంది ఆటపాటలతో అన్ని పాఠాలు బోధిస్తూ సాంఘిక శాస్త్రాన్ని అవపోసన పట్టింది పిల్లల మనసు లోతుల్లో తనదైన ముద్ర వేసిన శ్రీమతి సుజాత మేడం గారు ఇప్పుడు తనొఒక మహాశక్తిగా ఎదిగింది శాంతి సహనం అహింస మార్గంతో గాంధీ మార్గాన్ని ఎంచుకున్న ఈ తల్లి అన్నింటికీ నవ్వే ఒక సమాధానమనే సంకేతాన్ని సుస్పష్టం చేస్తుంది ఒక కొలిగ్ గా మృదు మధుర ముచ్చట్లతో మురిపించే పలుకులను భాషిస్తూ మమ్మానందింపజేసే మా సుజాత మేడం గారు పదవి విరమణ అనంతర జీవితాన్ని సుఖ సంతోషాలతో సకల అష్ట ఐశ్వర్యాలతో కొనసాగించాలని కోరుకుంటూ మీ కొలిగ్ చీపెల్లి బాపు, జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్రోపాధ్యాయ సంఘం మంచిర్యాల జిల్లా