Friday, 28 March 2025
STUTS.రాష్ట్రోపాధ్యాయ సంఘం, తెలంగాణ. మంచిర్యాల జిల్లా శాఖ............ ప్రథమ కార్యవర్గ సమావేశం తేది 7-3-2025
రాష్ట్రోపాధ్యాయ సంఘం, తెలంగాణ. మంచిర్యాల జిల్లా శాఖ............
ప్రథమ కార్యవర్గ సమావేశం తేదీ07-3-2025......................ప్రధాన కార్యదర్శి నివేదిక....
తేది 23-11-2024 రోజున నూతన జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల ఎన్నిక, ప్రభుత్వ ఉన్నత పాఠశాల గర్మిళ్ల లో జరిగింది. జిల్లా అధ్యక్షులుగా శ్రీ బట్టరి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా చీపెళ్లి బాపు అను నేను రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పార్వతి రెడ్డి గారు మరియు రాష్ట్ర ఎన్నికల పరిశీలకుల ఆధ్వర్యంలో ఎన్నుకోబడ్డాము. అప్పటి మాజి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీ శంకర్ గౌడ్ మరియు వెంకటేశ్వర్లు మాకిచ్చిన రెవెన్యూ సున్నా. నూతనంగా ఎన్నికైన మేమిద్దరం, తేది 08-12-2024 రోజున జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హైదరాబాదులోని కాచిగూడ లో గల ఎస్ టి యు భవనం నందు హాజరై ప్రసంగించాము.తేది 18-12-2024 గౌరవ మంచిర్యాల విద్యాశాఖ అధికారి శ్రీ ఎస్ యాదయ్య గారిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం తదనంతరం ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను పరిష్కరించమని కోరడం జరిగింది.తేది 26-12-2024 రోజున సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల దీక్షకు మద్దతుగా కలెక్టరేట్ వద్ద గల వారి శిబిరానికి వెళ్లి మద్దతు ప్రకటించడం జరిగింది. ఇదే రోజు సాయంత్రం రాష్ట్రోపాధ్యాయ సంఘం నిర్వహించే గూగుల్ మీట్ సమావేశంలో పాల్గొని డైరీ మరియు క్యాలెండర్ ల గురించి మాట్లాడడం జరిగింది. మరుసటి రోజు నుండి డైరీ మరియు క్యాలెండర్ల కొరకు గౌరవ ఎస్టీయు సభ్యుల నుండి రూపాయలు 8000 చందాల స్వీకరించి డైరీ లను తెప్పించుకోవడం మరియు క్యాలెండర్లను ప్రింట్ చేయించుకోవడం జరిగింది.తేది 03-01-2025 రోజున గౌరవ మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ గారి చేతులమీదుగా డైరీని ఆవిష్కరింప చేయడం జరిగింది.తేది 04-01-2025 రోజున గౌరవ మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ ప్రేమ్ సాగర్ రావు చేతుల మీదుగా డైరీ మరియు క్యాలెండర్లను ఆవిష్కరింప చేయడం జరిగింది.తేది 05-01-2024 రోజున మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ యాదయ్య గారి చేతుల మీదుగా డైరీలు మరియు క్యాలెండర్లు ఆవిష్కరించడం జరిగింది.తేది 17-01-2024 రోజున రాష్ట్రఉపాధ్యాయ సంఘం పిలుపుమేరకు ఎమ్మెల్సీ ఎన్నికల రివ్యూ మరియు అభ్యర్థి ఎంపిక తదితర అంశాలపై రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హైదరాబాద్ నందు గల కాచిగూడలో ఎస్టీయు భవన్ కు హాజరు కావడం జరిగింది. మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎస్టీయూమద్దతు అభ్యర్థి ప్రకటన సందర్భంగా కరీంనగర్ పీకాక్ హోటల్ కుతేది 02-02-2025 రోజునహాజరు కావడం జరిగింది.తేది 10-02-2025 రోజున ఎమ్మెల్సీ అభ్యర్థి కూర రఘోతంరెడ్డి గారి నామినేషన్ సందర్భంగా కరీంనగర్ కు వెళ్లడం జరిగింది. తేది 11-02-2025 నుండితేది 16-2-2025 వరకు జిల్లాలోని వివిధ ప్రభుత్వ మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సందర్శించి ఎమ్మెల్సీ ప్రచారం చేయడం జరిగింది. ఇదే రోజు STUTS నిర్వహించే గూగుల్ మీట్ లో పాల్గొనడం జరిగింది.17-02-2025 నుండి23-02-2025 వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరియు జూనియర్ కాలేజీలు అట్లాగే డిగ్రీ కాలేజీలను సందర్శించి క్యాంపెన్ చేయడం జరిగింది.తేది 24-02-2025 నుండి 26-02-2025 వరకు ప్రతి మండల్ హెడ్ క్వార్టర్ సందర్శించి పోలింగ్ బూత్ లో ఏజెంట్లను నియామకం చేయడం జరిగింది అట్లాగే ప్రతి పోలింగ్ స్టేషన్ ముందు టెంట్ మరియు కుర్చీలు వేయించడం జరిగింది.తేది 27-02-2025 రోజున మా వంతు సహకారం జిల్లాలోని అన్ని పోలింగ్ స్టేషన్ లలో చేయడం జరిగింది.తేది 07-03-2025 రోజున రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల గర్మిల్లా నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 18 మంది మహిళా ఉపాధ్యాయులను సన్మానించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంచిర్యాల మండల విద్యాధికారిని వి ఎస్ వి మాలవి దేవి గారు హాజరు కావడం జరిగింది. అలాగే రెవిన్యూ విషయానికొస్తే చందాలుగా వచ్చినఎనిమిది వేల రూపాయలు(8000), డైరీలకు మరియు క్యాలెండర్లకు ఖ xర్చు కాగా ప్రస్తుత రెవెన్యూ బ్యాలెన్స్ సున్నా అని కార్యవర్గ సమావేశంలోపాల్గొన్న సభ్యులచే ఆమోదింపడం జరిగింది...........................................................................
ఇట్లు చీపెల్లి బాపు జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్టోపాధ్యాయ సంఘం మంచిర్యాల జిల్లా శాఖ......
భీంరావ్ సార్ సన్మానం
తేదీ:27-3-2025 గురు వారం రోజున మంచిర్యాల జిల్లా డి సి ఈ బి కార్యదర్శి శ్రీ కొండు భీం రావ్ గారి ఉద్యోగ పదవీ విరమణ కార్యక్రమానికి ఎస్ టి యు టి ఎస్ మంచిర్యాల జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బట్టారి వెంకటేశ్వర్లు మరియు చీపెళ్లి బాపు లు హాజరై వారు ఉపాధ్యాయులుగా పిల్లలకు అందించిన సేవలను గుర్తు చేశారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షునిగా శ్రీ కొండు భీంరావ్ గారు ఉపాధ్యాయులకు అందించిన విశిష్ట సేవలు మరువలేనివి అని కొనియాడారు. తదనంతరం వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వరంగల్ ఆర్జెడి సత్యనారాయణ రెడ్డిగారు మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ యాదయ్య గారు, మంచిర్యాల మండల విద్యాధికారి వి ఎస్ వి మాలవి దేవి గారు ఎస్ టి యు జిల్లా గౌరవ అధ్యక్షులు వరహాల కరుణాకర్ గారు,జిల్లా అసోసియేటెడ్ అధ్యక్షులు ఏ సత్తయ్య గారు, జిల్లా ఉపాధ్యక్షులు వి పద్మ గారు, బి మన్మోహన్ గారు, కె మహాలక్ష్మి గారు, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి ఎం సుమన్ గారు, జిల్లా కార్యదర్శిలు డి స్వప్న దేవిగారు , టి జయ గారు జిల్లా ఆర్థిక కమిటీ సభ్యులు పి సుజాత గారు, డి గంగుతాయి గారు మంచిర్యాల మండల అధ్యక్షులు ఆర్ మల్లేశం గారు, కార్యవర్గ సభ్యులు పి విశ్వనాథ్ గారు,ఓ కృష్ణ గారు, శోభారాణి గారు తదితరులు పాల్గొన్నారు.
అలుపెరుగని స్నేహశీలి
అలుపెరుగని స్నేహశీలి........... తన ఊహలు చెక్కిన శిల్పాకృతులు ఉన్నచోటే తనున్నాడు చీకటి రేఖల్లో జీవన ప్రమాణాన్ని కొలువ లేని బ్రతుకు చిత్రాల్లో గణిత సృజనత్వాన్ని స్పృశింపజేసే గణితాన్వేషకుడిగా గరిమిళ్ళ హైస్కూల్లో మొదటి బోధన ఆరంభించారు ప్రకృతిలో వెన్నెల సౌందర్యాన్ని చూసిన కనులతో అప్పటి గణిత పద్ధతులను అవలోకనం చేసుకొని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వినియోగించే మార్పులను బోధ చేసుకుని గణితమనే పంట పొలముకు ఎరువులు వేసి రాబడి తీసిన సాంకేతిక పరిజ్ఞాని ఈ గణిత సాధకుడు భక్తి తత్వాన్ని కనులలో దాచుకున్న ఈ కొండువంశీయుడు నిత్య భక్తి కృషివనలుడైన ధార్మిక ప్రియుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాష్ట్రోపాధ్యాయ సంఘం అధ్యక్షుడిగా ఉపాధ్యాయులకు విశిష్ట సేవలు అందించిన ఈ నాయకుడు మంచిర్యాల విద్యాశాఖలో కీలక పదవి అయిన డి సి ఈ బి సెక్రెటరీ హోదా లో ఉద్యోగ పదవీ విరమణ పొందుతున్న ఓ ఉత్తమ జిల్లా స్థాయి అధికారి శ్రీ కొండు భీంరావ్ గారు అందుకే తన ఊహలు చెక్కిన శిల్పాకృతులు ఉన్నచోటే తనున్నాడు వీచే పవన తరంగాలు తన పైనుంచి దృశ్యమానమవుతూ భీంరావ్ అంటే విభిన్న స్వరాల సామూహిక గానమని, భీంరావ్ అంటే మనుషుల మధ్య ఐక్యత అని మేఘాలు గీచుకున్న మెరుపుల రేఖ చిత్రాలతో సంభాషిస్తున్నాయి స్నేహం కోసం చీకటి గుహలను చీల్చుకొని కొండలపై నుంచి నడిచే నవతరం రైలులా అలుపెరుగని స్నేహశీలియై చీకటిలో వెలుగు రవ్వ అయినాడు ఓ సాహసీ గా పెయి మీది జ్వరాన్ని వాతావరణానికి కానుకగా ఇచ్చి ఆ చల్లని చిరునవ్వులతో కన్నీటికి, చెమట చుక్కలకి తేడా తెలవనీయని విశాల దృక్పథుడు మంచి మార్పు కోసం ఆకాంక్షించే ఈ మహా మనిషి అనంతాన్ని ఆకాశంతో కాదు ప్రేమతో, స్నేహంతో పోల్చే మనందరి బంధువు ఇంతటి గొప్పవారైన శ్రీ కొండు భీంరావు గారు ఉద్యోగ పదవీ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతూ భావి జీవితాన్ని మరింత ఉత్సాహంతో గడపాలని కోరుకుంటూ................................................
ఇట్లు మీ ఆత్మీయుడు చీపెల్లి బాపు జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్టోపాధ్యాయ సంఘం మంచిర్యాల జిల్లా శాఖ......
Thursday, 27 March 2025
Sunday, 23 March 2025
Wednesday, 19 March 2025
Subscribe to:
Comments (Atom)



































